12‌న జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం : రాపోలు వీరమోహన్‌

అం‌తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహిస్తారు. లింగ అసమానత, మహిళలపై హింస, వేధింపులు, వారు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం మరో ముఖ్యోద్దేశం.

జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 12వ తేదీన నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని కమ్యూనిటీ సెంటర్‌, ‌మల్లికార్జున నగర్‌ ‌నార్త్, ‌చింతలకుంట చెక్‌ ‌పోస్ట్, ఎల్‌బీ నగర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ అధ్యక్షులు రాపోలు వీరమోహన్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, కుల సంఘం పెద్దలు, మహిళామణులు హాజరుకానున్నారని తెలిపారు.

ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్‌, ‌మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ (ఏపీ) పోతుల సునీత, జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్‌ ‌పర్సన్‌ ‌డా. భోగ శ్రావణి, తెలంగాణ పద్మశాలీ సంఘం (హైదరాబాద్‌) ‌కన్వీనర్‌ ‌మచ్చ ప్రభాకర్‌ ‌రావు, శ్రీ బాలాజీ హాస్పిటల్స్ అధినేత్రి పోశం సునీత, విశ్రాంత ఏసీపీ (వరంగల్‌) ‌ముండ్రాతి రమేశ్‌, ‌ఖమ్మం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కార్పొరేటర్‌ ‌కమర్తపు మురళి, ఇతర పద్మశాలీ ప్రముఖులు, జిల్లా సంఘాల అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న పద్మశాలీ మహిళామణులు విచ్చేయనున్నారని పేర్కొన్నారు. పండుగను తలపించేలా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల కమిటీ సభ్యులు, మహిళా విభాగం, యువజన విభాగం సభ్యులు, ఐక్యవేదిక సభ్యులంతా హాజరై మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో మహిళామణులందరిని సన్మానించనున్నట్లు రాపోలు వీరమోహన్‌ ‌తెలిపారు.

చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్‌ నంబర్‌ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది. 

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Best online casino Canada real money

Follow us on social media

Related posts

Leave a Comment