పేవా పల్నాడు జిల్లా నూతన కమిటీ ఎన్నిక..

చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: పద్మశాలీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (పీఈడబ్ల్యూఏ – ఏపీ) పల్నాడు జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. సత్తెనపల్లిలో జూలై 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంలో గౌరవాధ్యక్షులుగా గడ్డం రామనాథ్‌, అధ్యక్షులుగా ఎంవీ భావన ఋషి, ప్రధానకార్యదర్శిగా వంగర మురళి, కోశాధికారిగా తుమ్మ శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పీఈడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు జీవీఎస్‌ రామకృష్ణ హాజరై మాట్లాడారు. సభ్యత్వాల నమోదు పెంచి సంఘాన్ని బలోపేతం చేయాలని సూచిస్తూ.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లాను మూడుగా విభజించిన నేపథ్యంలో కొత్తజిల్లా పల్నాడుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

గడ్డం రామనాథ్‌ సత్తెనపల్లి మండలం సుగాలికాలనీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా, ఎంవీ భావనాఋషి క్రోసూర్‌ మండలం గరికపాడు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా, తుమ్మ శ్రీనివాసరావు చిలకలూరిపేటలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా వంగర మురళి (నరసారావు పేట) విశ్రాంత ఉపాధ్యాయులు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

Twitter

Follow us on social media

Related posts