చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్వకులశాలీ సంఘం అధ్యక్షులుగా రామలింగేశ్వర కాంళ్లే ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గద్వాలలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు, గద్వాల చేనేత కార్మిక సంఘం నాయకులు కలిశారు. శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీఆర్‌పీఎస్) నాయకులు కోట నరసింహులు, మాకం బాలరాజ్, మేడం రామకృష్ణ, కార్మిక సంఘం అధ్యక్షులు చిన్ని నాగరాజు, ఉపాధ్యక్షుడు పోతు భీమేష్, కార్యదర్శి పగడాకుల శంకర్, నీలి శంకర్, నీలి శేఖర్, నీలి శివరాములు, ఏర్వ రాము, సాక రాము, పగడాకుల గోపాల్, పగడాకుల రాజేష్, వీరన్న, మధుసూదన్, మేడం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


