నిరుపేదలకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో మే13వ తేదీన అందజేశారు. ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి వినతులు వస్తున్నా.. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు వార్డు వలంటీర్ల ద్వారా అర్హులయిన పేదలను గుర్తించి వారికి మాత్రమే కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవ రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు లోకేష్, చెన్నప్ప పాల్గొన్నారు.
నర్సులకు సన్మానం
ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా మే12వ తేదీన బుట్టా ఫౌండేషన్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మేనజర్ రాజేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ బాధితులను వైద్యులతో పాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. కోవిడ్, కాన్సర్ వార్డులో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు మేరి కళావతి, విమల, సుగుణ, విజయమ్మ, స్వాతి, జ్యోతి, వాణిలను సన్మానించి శ్యానిటైజర్లు అందజేశారు. కార్యక్రమంలో క్యాన్సర్ వార్డు చీఫ్ డాక్టర్ శ్రీకృష్ణ ప్రకాష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబేద్కర్, ఫౌండేషన్ ప్రతినిధి చెన్నప్ప, బుట్టా ఫౌండేషన్ కోఆర్డినేటర్ చరిత పాల్గొన్నారు.
చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి. Хτrаdеgrοk 8.1 Flех

