పద్మశాలీయులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి: మధ్యప్రదేశ్‌ ఐ అండ్ పీఆర్ కమిషనర్‌ పరికిపండ్ల నరహరి

పద్మశాలీయులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ పరికిపండ్ల నరహరి ఆకాంక్షించారు. ముందుగా స్వాతంత్య్ర సమరయోధులు, దివంగత ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో వీవర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బీసీ నేత వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పద్మశాలీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమానికి విశ్రాంత ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ విద్య ఒక్కటే మనిషి ఎదుగుదలకు మూలం అని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు. బాగా చదివే పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం చేయాలని సూచించారు. పద్మశాలీయుల ఐక్యంగా పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. అనంతరం చేనేత సంఘాల ప్రతినిధులు అదిగొప్పుల సంపత్‌, దువ్వాల రాజేందర్‌, శ్రీనివాస్‌, ఎలుగం సాంబయ్య, మాచబత్తుల కుమారస్వామి, చిప్ప వెంకటేశ్వర్లు చేనేతల ఇబ్బందులను నరహరికి వివరించారు. తర్వాత నరహరిని ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ములుగు జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌, వరంగల్‌ జిల్లా ప్రజాపరిషత్‌ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి దాసరి ప్రేమ్‌ సాగర్‌, మాజీ కార్పోరేటర్‌ కుసుమ సతీష్‌, పోపా అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్‌, పండ్ల మార్కెట్‌ అధ్యక్షులు సాంబయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య, మూర్తి, విద్యా విభాగం అధ్యక్షులు వంగరి సూర్యనారాయణ, ప్రముఖ క్యాన్సర్‌ నివారణ వైద్యులు డాక్టర్‌ మంచికట్ల జనార్దన్‌, మాజీ సర్పంచ్‌ గాడిపెల్లి రాజేశ్వర్‌ రావు చేనేత పరిరక్షణ సమితి నాయకులు వెంకటేశ్వర్లు, ఉత్తమ జర్నలిస్ట్‌ అవార్డు గ్రహీత మెండు రవీందర్‌, డీంబాయ్‌ టీివి సీఈవో వేముల సదానందం, ఆడెపు రవీందర్‌, గజ్జెళ్ళి రవీందర్‌ పాల్గొన్నారు. Værdiborg

Follow us on social media

Related posts

Leave a Comment