రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని (డిసెంబర్ 21) పురస్కరించుకుని కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కోడుమూరులో రక్తదానం చేశారు. అంతకుముందు కోడుమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త కోట్ల హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వంపై అప్పుల భారం మోపిందని, అయినా ఎన్నికల హామీ మేరకు అతి తక్కువ కాలంలో మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. అధికార, పాలన వికేంద్రీకరణ రాష్ట్రాభివృద్థికి దోహదం చేస్తాయన్నారు. మహిళలపై లైంగిక దాడులకు అరికట్టేందుకు శాసనసభలో చట్టం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్ష వర్దన్ రెడ్డి, కర్నూలు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షులు బీవై రామయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు కర్నూలు జిల్లాలో వీక్షించండి Værdiborg
