లాక్‌డౌన్ నేపథ్యంలో విజయవాడ 39వ డివిజన్‌లో గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు గుండారపు పూజిత నిత్యావసరాలు (బియ్యం, కందిపప్పు, గోధుమ రవ్వ, మంచి నూనె, కర్భూజ) అందజేశారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 200 కుటుంబాలకు రూ. 800 విలువ చేసే కిట్లను ఆమె పంపిణీ చేశారు. ట్రస్ట్ తరపున ఇటీవల మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు రాజ మాణిక్యం ఎనక్లేవ్, నృసింహ ఎనక్లేవ్, సాయి పరిమల మహాలక్ష్మీ నివాస్‌ల్లోని ఒక్కో కుటుంబానికి ట్రే చొప్పున 150 కుటుంబాలకు
గుడ్లు అందజేశారు. కార్యక్రమంలో రామ్ కుమార్, మురళి, పండు పాల్గొన్నారు.

చేనేత వర్గాల సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాలను వాట్సప్ నంబర్ 83338 71117కు పంపండి. www.chenetamitra.com లో వీక్షించండి. Ascenso Finviora

