చేనేత సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఆంధప్రదేశ్ వీవర్స్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీ వెపా) రాష్ట్ర అధ్యక్షులు కే వెంకట శేషయ్య పేర్కొన్నారు. సెప్టెంబర్ 6 తేదీ రాత్రి 7 నుంచి 9.30 గంటల వరకు శ్రీకాకుళం వాసులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ముందుగా వెపా ఆవిర్భావం, లక్ష్యాల గురించి క్లుప్తంగా వివరించారు. ఏపీలోని 13 జిల్లాలో తమ శాఖలను విస్తరించనున్నామని అందులో భాగంగానే ప్రతివారం ఒక్కో జిల్లాకు చెందిన వారితో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆహ్వానించిన వెంటనే వీడియో కాన్ఫరెన్సులో తప్పక పాల్గొంటానిని చెప్పడం చేనేతల ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రజా సాధికార సర్వే ప్రకారం ఏపీలో చేనేతలు సుమారు 30 లక్షల మంది ఉండగా.. ప్రభుత్వం 12 లక్షల మంది మాత్రమే ఉన్నారని చూపడం దారుణమన్నారు.
దాదాపు 2 గంటల పాటు ఆసక్తికరంగా జరిగిన కాన్ఫరెన్సుకు వెపా గుంటూరు జిల్లా బాధ్యులు, చేనేత కవి రాపోలు జగన్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. అనంతరం కాన్ఫరెన్సులో పాల్గొన్న పలువురు తమను పరిచయం చేసుకుని ఎంతో ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
దివి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో చేనేత సమాజానికి చెందిన 750 పేద కుటుంబాలకు నిత్యావసరాలు కిట్లు పంపిణీ చేశామన్నారు. కాశిన సూర్య ప్రసాద రావు మాట్లాడుతూ వ్యక్తిగతంగా కాకుండా సంఘటితంగా ఉద్యమిస్తేనే ఏదైనా సాధించగలమని, సంఘటిత శక్తిగా ఎదిగేందుకు చేనేత సమాజంలోని అన్ని వర్గాల సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు.
రామారావు మాట్లాడుతూ పరస్పర పరిచయాల వల్ల సమాచార ప్రసారం సులువవుతుందన్నారు. ఐక్యతకు మార్గం సుగమమవుతుందన్నారు. డాక్టర్ జె. రవీంద్ర కుమార్ మాట్లాడుతూ చేనేతల అభ్యున్నతికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. వైద్యపరంగా కూడా తనను సంప్రదించవచ్చన్నారు. గ్రామీణ స్థాయి నుంచి సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చేనేత నిరుద్యోగ యువతకు సమాచారం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. చేనేత సమాజం ఇతర కులాల వారికి ఆదర్శం కావాలన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో చిలువేరు మార్కండేయులు, రంగసాయి, నీలాద్రి రావు, మంచు జనార్దన రావు, తాటిపర్తి వెంకటేశ్వర్లు, ఊట్ల అప్పారావు, బూదాటి బాల కోటేశ్వరరావు, కే. పరంధామయ్య, గంజి ఏడుకొండలు, కర్రా రవి, బీవీవీ సత్యనారాయణ, శ్రవణ్‌కుమార్, బీవీ చంద్రశేఖర్, నీలంశెట్టి సత్య ప్రసాద్, ప్రసాద రావు, రాజీవ్, వెంకటరమణ, చుక్కల రాంమ్మూర్తి, కే. ఆనందరావు, తేలప్రోలు వాసుదేవమూర్తి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలుసుకుని అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంఘం ఏర్పాటు, అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని హామీ ఇచ్చారు. Záloha Valnex

