ఇలా చేద్దాం.. కరోనా నుంచి కోలుకుందాం.. శ్వాస సంబంధ వ్యాయామాలు తప్పనిసరి: ఫిజియోథెరపిస్ట్ డాక్టర్‌. అర్షద్‌ అయూబ్‌

ఫిజియోథెరపీ కౌన్సిల్‌ సెప్టెంబర్‌ 8, 1951లో ఏర్పడడంతో అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘‘ఫిజియోథెరపీ డే’’ను ఏటా సెప్టెంబర్‌ 8న నిర్వహిస్తున్నారు. మారుతున్న జీవిన శైలితో వివిధ రకాలు జబ్బుల బారిన పడుతున్నాం. వ్యాధులు ప్రజలను పలు విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని కోవిడ్‌-19 పీడిస్తోంది. ఈ వైరస్‌ను ఎదుర్కొడానికి పలు రకాల కంపెనీలు వ్యాక్సిన్‌ల తయారీలో తలమునకలయ్యాయి.
వీటికి ఫిజియోథెరపీ అవసరం..
ఆల్జిమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్‌, పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కార్డియో ఫల్మనరీ సమస్యలు, ఆర్థో, న్యూరాలజీ సమస్యలకు బాధపడుతున్న వారికి ఫిజియోథెరపీ అవసరం. మందులతో నయంకాని కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు చివరికి ఫిజియోథెరపీతో ఉపశమనం పొందుతున్నారు.

కరోనా సోకిన వారిలో కొందరికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన మందులు వాడడంతో పాటుగా తరుచూ ఆవిరి పట్టడం మంచిది. కొన్ని రకాల శ్వాస సంబంధ వ్యాయామాలు కరోనా నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్‌. అర్షద్‌ అయూబ్‌.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ఇలా చేయండి..

1. శ్వాస తీసుకునే వ్యాయామం: ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గాలిని లోపలికి పీల్చుకొని, నిదానంగా నోటి ద్వారా 6 సెకన్ల పాటు బయటకు వదలాలి. ఇలా రోజులో 5 సార్లు చేయాలి.
2. డాయాఫర్గమాటిక్‌ వ్యాయామం: పొట్ట మీద ఒక చేయి పెట్టుకొని, ఛాతి మీద మరో చేయి పెట్టుకొని లోతుగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా నెమ్మదిగా శ్వాస వదలాలి. ఇలా రోజుకు 5 సార్లు చేయాలి.

3. 4-4-6 వ్యాయామం: ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు శ్వాస తీసుకొని, 4 సెకన్ల పాటు శ్వాస ఆపాలి. తరువాత నిదానంగా 6 సెకన్ల పాటు బయటికి వదలాలి. ఇలా రోజులో 5 సార్లు చేయాలి.

4. స్పైరో మీటర్‌తో వ్యాయామం: స్పైరో మీటర్‌తో దీన్ని చేయాలి. గాలిని గట్టిగా పీల్చుకొని బాక్స్లో ఉన్న బంతులను 5 సెకన్ల పాటు ఆపాలి. ఇలా రోజులో 5 సార్లు చేయాలి.

ఊపిరితిత్తుల్లో కఫం బయటకు..

ఛాతిని బెడ్‌కు వాల్చి (బోర్ల) పడుకోవాలి. ఫలితంగా ఊపిరితిత్తుల్లో ఉన్న కఫం బయటకు వస్తుంది. ఇలా 30 నిమిషాల నుంచి 2 గంటలు పాటు నిద్రించాలి. తరువాత కుడివైపు తిరిగి 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవాలి. లేచిన తరువాత 30 నిమిషాల నుండి 2 గంటలకు వరకు కూర్చోవాలి. తరువాత ఎడమవైపు తిరిగి 30 నిమిషాల నుండి 2 గంటలకు పడుకోవాలి. తర్వాత మళ్లీ బోర్ల పడుకోవాలి.

 ఆందోళన వద్దు

కరోనా సోకిందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచన మేరకు మందుల వాడితే వ్యాధి నయమవుతుంది. కొందరు అనవసరంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. జోక్స్, సినిమా హాస్యపు సన్నివేశాలు వీక్షించడం వల్ల వచ్చే నవ్వు ఫలితంగా మెదడులో ఎండోఫిన్‌ అనే రసాయనం విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. కరోనా నుంచి త్వరగా కోలుకోడానికి దోహదపడుతుంది.  పౌష్టికాహారం తీసుకోవడం, మందులువాడడం, కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల కోవిడ్‌-19 జయించవచ్చు. Nový Kapitstav

– డాక్టర్‌. అర్షద్‌ అయూబ్‌, కన్సల్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్, 
కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు. సెల్ : 90323 49409.

Follow us on social media

Related posts

Leave a Comment