‘‘పద్మశాలీయుల ఐక్యత, అభ్యున్నతి కోసం పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీవా) 2008 డిసెంబర్‌లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఎంతోమంది దాతలు కులాభిమానంతో అసోసియేషన్‌కు అండగా నిలిచారు. వారి ఆర్థిక సహాయ సహకారాలతో అసోసియేషన్ కులస్థులకు ఎన్నో రకాలుగా ఆదుకుంది. దాతలకు అసోసియేషన్ తరుపున ధన్యవాదాలు. ఇకముందు కూడా దాతలు సహకరిస్తే ఇబ్బందుల్లో ఉన్న మరికొంత మంది మన కులస్థులను ఆదుకోగలం.
దాతల ఉదారతకు ధన్యవాదాలు..
అసోసియేషన్‌కు ఇచ్చే విరాళములకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. విదేశీ విరాళాలు పొందేందుకు వీలుగా ఎఫ్‌సీఆర్‌ఎ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. కోడిదాసు సత్యన్నారాయణ (చినబాబు) రూ. 5 లక్షలు, దివంగత ఆకురాతి పేరయ్య కూతురు సుజాత (యుఎస్‌ఏ) రూ. 11 లక్షలు, కాకినాడకు చెందిన వింజమూరి భాస్కరరావు ఇటీవల రూ. 15 లక్షలు విరాళం ఇచ్చారు. మరో ఇద్దరు దాతలు రూ. 2 లక్షలు చొప్పున, ఏడుగురు దాతలు రూ. 1 లక్ష చొప్పున ఇచ్చారు.
2వేలుకు పైగా సభ్యులు..
ఇప్పటి వరకు 2,294 మంది అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. రూ. 25,000 సభ్యత్వంతో 91 మంది, రూ. 15,000 సభ్యత్వంతో 234 మంది, మిగిలిన వారు రూ.5,000, 2,000 సభ్యత్వాలతో సభ్యులుగా చేరి ఉన్నారు. ఈ సభ్యత్వాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 1,50,47,379 కాగా, రూ. 1,50,00,000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్సడ్ డిపాజిట్ చేశాం. దీనిపై వచ్చే వడ్డీ, దాతల ప్రత్యేక సహకారంతో సుమారు రూ. 2 కోట్ల సహాయాన్ని పద్మశాలీ పేదలకు, విద్య, వైద్య రంగాలలో పేద పద్మశాలీ విద్యార్థులకు, ఆపదలో ఉన్నవారికి ఆదుకుంటున్నాం.
మాసపత్రిక ద్వారా సేవా కార్యక్రమాల సమాచారం..
చీరాల, మంగళగిరి, గుంటూరు, తెనాలి, కృష్ణ జిల్లా, ఉత్తరాంధ్ర, భట్టిప్రోలు, హైదరాబాద్‌ల్లో బ్రాంచీలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మన పద్మశాలీయుల కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు, చేనేత సమస్యలు, ఇతరత్రా విషయాలను ‘‘మార్కండేయ’’ మాసపత్రిక ద్వారా కులస్థులందరికి తెలియపరుస్తున్నాం.
దాతలు సహకరించాలి..
పీవా ద్వారా కులస్థుల శ్రేయస్సుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటి వరకు అసోసియేషన్‌లో చేరిన సభ్యులందరికీ ధన్యవాదాలు. సభ్యులంతా పద్మశాలీ బంధుమిత్రులందరిని అసోసియేషన్‌లో సభ్యులుగా చేర్పించి బలోపేతానికి సహకరించాలని కోరుతున్నాం. విరాళాలు ఇచ్చే వారు బ్యాంక్ అకౌంట్, ఇతర సమాచారం కోసం పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య ఫోన్ చేసి (0866-2444641 లేదా సెల్ : 9849524692) తెలుసుకోవచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు తెలుసుకోవచ్చు.’’
– స్వర్గం పుల్లారావు, అధ్యక్షులు,
పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. Nový Kapitstav
