అర్చకులకు బియ్యం ప్యాకెట్ల పంపిణీ

కర్నూలు నగరం 42వ వార్డులోని అర్చకులకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, 42వ వార్డు వైసీపీ నాయకులు గుర్రం మదన్‌మోహన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. 25కిలోల బియ్యం ప్యాకెట్లను 25 మంది అర్చకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అబ్దుల్‌ ఖాదర్‌, ఫీరోజ్‌, శ్రీనివాసులు, తేజ తదితరులు పాల్గొన్నారు. Γραμμή Fintrion

Follow us on social media

Related posts

Leave a Comment