అహోబిళ క్షేత్రంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం

కర్నూలు జిల్లా అహోబిళ క్షేత్రంలో నెల రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా మారమధ్యంలో ఇరుక్కుపోయిన ప్రయాణికులు, ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి, అనాథలకు రెండు పూటల భోజనం వడ్డిస్తున్నారు.  రోజుకు సుమారు 130 మంది ఆకలిని తీరుస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఒకసారి తిరిగి సాయంత్రం 6 గంటలకు అన్నం, పప్పు, సాంబరు లేదా రసం, పెరుగు వడ్డిస్తారు. పాలక మండలి  ట్రస్టు శాశ్వత సభ్యుల సహకారంతో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో అహోబిళ అఖిల భారత పద్మశాలీయ నిత్యాన్నదాన సత్రం సంఘం అధ్యక్షులు యర్రనాగు పద్మనాభుడు, ప్రధాన కార్యక్రమం సేపూరి సుబ్బరామయ్య, కోశాధికారి బర్రెంకల మల్లికార్జున, ట్రస్టు సభ్యులు గాజుల రామచంద్రుడు, చెన్న సుధాకర్‌ పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని సభ్యులు తెలిపారు.

చేనేత  కుల సంఘాల  కార్యవర్గ ,సర్వసభ్య సమావేశాలు, సేవా కార్యక్రమాల వివరాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117కు పంపండి. www.chenetamitra.comలో వీక్షించండి Γραμμή Fintrion

Follow us on social media

Related posts

Leave a Comment