చేనేత సమాజ అభ్యున్నతికి ఆచరణీయ సూత్రాలు
ఆత్మీయ చేనేత బంధువులకు నమస్కారం..
విశాల చేనేత సమాజ వికాసం మన స్వప్నం. ఈ స్వప్నం సాకారానికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చేనేత సోదరులతో బలమైన కమిటీ ఏర్పాటు కావాలి. అది చేనేత సామాజిక చైతన్యానికి ప్రతీక కావాలి. చేనేత సమాజ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగాలి. చేనేత సమాజం దశ-దిశ మార్చే ఈ 10 సూత్రాల ఆచరణకు మనమంతా కలిసి పనిచేద్దాం.
1. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేనేతలందరి కోసం భవనాల నిర్మాణం జరగాలి.
2. పేద, మధ్య తరగతి ప్రజలు శుభ్య కార్యాలు, సమావేశాల నిర్వహణకు ఇవి ఉపయోగపడాలి.
3. చేనేత వృత్తిదారులకు అవసరమైన ముడిసరుకులను 50 శాతం రాయితీతో ఈ కేంద్రం ద్వారా సమకూర్చాలి.
4. చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఈ కేంద్రంలో కొనుగోలు చేయాలి.
5. కొన్ని రకాల ఉత్పత్తులను చేనేతలు మాత్రమే తయారు చేసేలా గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు ఒత్తిడి తీసుకు రావాలి. ఈ చట్టం అమలు కోసం ఏర్పాటైన రీజినల్ డైరెక్టర్ కేంద్రాలు సరిగ్గా పనిచేసేలా చూడాలి. ఫలితంగా నిరంతరం చేనేత కళాకారులకు పని ఉంటుంది.
6. 50 సంవత్సరాలు పైబడిన పేద చేనేత కళాకారులకు సామాజిక భద్రత గుర్తింపు కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబంలో ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలి.
7. నిర్ణీత సమయంలో చేనేత సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలి. ఈ పని ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగాలి.
8. మన చేనేత సమాజంలోని పేద విద్యార్థులకు ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేకపోతే వారి చదువుల కొనసాగింపునకు ప్రభుత్వం అండగా నిలిచేలా చూడాలి లేదా మనందరం కలిసి ఆర్థిక సాయం చేయాలి.
9. మన విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి శిక్షణ ఇప్పించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలి.
10. ఇవన్నీ సాధించిన రోజు ‘రాజ్యాధికారం’ మన దరి చేరుతుంది.
చేనేతల అభ్యున్నతిని కాంక్షిస్తూ ..
సదా మీ సేవలో..– కేవీ శేషయ్య నేత
ఆంధప్రదేశ్ చేనేత ఉద్యోగులు అండ్ ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం. (రిజిస్టర్డ్ 271/2018). Tyvixom
