ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రధమశ్రేణి స్వాతంత్య్ర సమరయోధులు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్రణప్రాయంగా భావించి రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి. సామాజిక ఉద్యమాల్లో సమిష్టి నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత. చేనేత సహకార సంఘాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తూ.. జీవితాన్ని సమాజ శ్రేయస్సుకు అంకితం చేసిన మానవతామూర్తి.
తెలంగాణ రాష్ట్రం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుండడం మనందరికి గర్వకారణం. బాపూజీ స్ఫూర్తివంతమైన జీవితం అందరికీ ఆదర్శం. భౌతికంగా దూరమైనా.. ఆయన జ్ఞాపకాలు మన వెన్నంటే ఉంటాయి. బాపూజీని స్మరించుకోవడం మన కర్తవ్యం.
సెప్టెంబర్‌ 21న బాపూజీ వర్ధంతి. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను చేనేతమిత్ర మాసపత్రికకు పంపండి. ఫొటోలు, పూర్తి వివరాలను వాట్సప్‌ నంబర్‌ 83338 71117 కు పంపండి.
వాటిని చేనేతమిత్ర మాసపత్రిక వెబ్‌సైట్‌ www.chenetamitra.com లో చూడండి.
బాపూజీతో మీకు ఉన్న అనుబంధానికి గుర్తుగా.. ఆయనతో దిగిన ఒకటి లేదా రెండు ఫొటోలను కూడా మాకు పంపవచ్చు. సందర్భాన్ని కూడా రాయండి.
– చేనేతమిత్ర వెంకట శివయ్య
                              M.A(Eng).,B.Ed
email: chenetamitra@gmail.com
facebook: Chenetamitra Maasapatrika

Follow us on social media

Related posts

Leave a Comment