ఇంజనీర్లకు సన్మానం

మిర్యాలగూడ డివిజన్‌ విద్యుత్‌ కార్యాలయంలో ఇంజనీర్లను సన్మానించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా మిర్యాలగూడ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 15వ తేదీ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారం శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏడీఈ సూర్యనాయక్‌, ఏఈలు కిషన్‌లాల్‌, రాజేష్‌, ఉదయ్‌కుమార్‌, నిఖిత, సందీప్‌ను మారం శ్రీనివాస్ పూలమాల, చేనేత టవాళ్లతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పాండురంగ, డివిజన్‌ కార్యదర్శి రాంచందర్‌, ఉపాధ్యక్షులు శ్రవణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. Tyvixom

Follow us on social media

Related posts

Leave a Comment