నీటి అవిరితో నడిచేవి
నాటి ఇంజన్ల బండ్లు
రాతి నూనెలతో నడుస్తాయి
నేటి ఇంజన్ల బండు
ఇంజిన్కు నీరుపోసి నడిపించి
ఇంజినీర్లు అయ్యారు నాడు
ఇంజిన్లో లోపాలు వున్నా
ఇనుములో లోపాలు వున్నా
ఇంజిన్ శబ్దాలు వినగానే
ఇట్టే కనిపెట్టే వారే ఇంజినీర్లు
నాటి అలనాటి ఇంజినీర్లు
మేటి అయిన ఇంజినీర్లు
మోక్షగుండం లాటి ఇంజినీర్లు
ముందుచూపు కలిగిన ఇంజినీర్లు
ఇంజిన్ నీటితో నడిపే ఇంజినీర్లకు
ఇంజిన్ నిప్పుతో నడిపే ఇంజినీర్లకు
ఇంజిన్ గాలితో నడిపే ఇంజినీర్లకు
ఇంజిన్ ఇగ్నిషన్‌తో నడిపే ఇంజినీర్లకు
ఇంజిన్ లా పని చేసే ఇంజినీర్లందరికి
ఇంజినీర్ల దినోత్సవ శుభాకాంక్షలు.

– పోకూరి చంద్రశేఖర్
రిటైర్డ్ సూపరింటెండెంట్,
శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, అనంతపురము.
సెల్: 79 89 72 39 37. Ascenso Finviora
