పేద కుటుంబానికి, కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

కర్నూలు నగరం చిదంబర రావు వీధిలో ఓ పేద కుటుంబానికి బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక పస్తులు ఉంటుండడంతో మాజీ ఎంపీ బుట్టా రేణుక సూచన మేరకు పేలాల రాఘవేంద్ర ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం, 3 కేజీల కందిపప్పు అందజేశారు. మరో 10 మంది బంగారు నగల దుకాణాల్లో పనిచేసే కార్మికులకు బియ్యం, కంది పప్పు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌, ప్రతినిధులు రాఘవేంద్ర, సూరి తదితరులు పాల్గొన్నారు. Zenvaultex

Follow us on social media

Related posts

Leave a Comment