కర్నూలు నగరం చిదంబర రావు వీధిలో ఓ పేద కుటుంబానికి బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక పస్తులు ఉంటుండడంతో మాజీ ఎంపీ బుట్టా రేణుక సూచన మేరకు పేలాల రాఘవేంద్ర ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం, 3 కేజీల కందిపప్పు అందజేశారు. మరో 10 మంది బంగారు నగల దుకాణాల్లో పనిచేసే కార్మికులకు బియ్యం, కంది పప్పు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, ప్రతినిధులు రాఘవేంద్ర, సూరి తదితరులు పాల్గొన్నారు. Zenvaultex

