చేనేత సంఘాలన్ని ఏకం కావాలి: పెడన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బండారు అనంద్‌ ప్రసాద్‌

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి చేనేత సంఘాలన్ని ఏకం కావాలని పెడన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బండారు అనంద్‌ ప్రసాద్‌ సూచించారు. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తే ప్రజాప్రతినిధులు కూడా స్పందించే అవకాశం ఉంటుందన్నారు.

కృష్ణ, గుంటూరు జిల్లాల్లో సంఘం బలోపేతానికి చేనేత ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం (వెపా) సమన్వయ కర్త కె. వెంకటశేషయ్య, గుంటూరు జిల్లా బాధ్యులు రాపోలు జగన్‌ డిసెంబర్‌ 6వ తేదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 10.15 గంటల వరకు నిర్విరామంగా జరిగిన ఈ సమావేశంలో పలువురు చేనేత ప్రముఖులు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేతల సంఖ్య నిర్ధిష్టంగా లేదన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న సంఖ్యకు, అసలు సంఖ్యకు తేడా ఉందన్నారు. చేనేత కార్మికులు, ఇతర వృత్తులో ఉన్న వారిని కూడా కలుపుకొని పోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి కోసం పోరాడాలని సూచించారు.

సామాజిక వేత్త, హైకోర్టు న్యాయవాది వైకే మాట్లాడుతూ చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి, వెంటనే పరిష్కరించుకోవాల్సినవి ఏమిటని గుర్తించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. మరోవైపు సంఘ నిర్మాణంపై కసరత్తు జరగాలన్నారు.

అప్కో రిటైర్డ్ డీఎంవో అనంత వెంకటరమణ మాట్లాడుతూ మన రాష్ట్రంలో కంటే పక్క రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమ బాగానే ఉందన్నారు. పవర్‌ లూమ్స్ వల్ల చేనేత రంగం కుదేళయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఇదే విషయాన్ని సందర్భానుసారంగా ఉత్తరాల ద్వారా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నానని వివరించారు.

పొలిటికల్‌ సైన్స్ విశ్రాంత అధ్యాపకులు ముషం అనంతరాములు మాట్లాడుతూ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడంతో సరిపోదని, వాటికి నిధులు కూడా కేటాయించాలని కోరారు. పడవల మోహన్‌ రావు మాట్లాడుతూ చేనేతల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు.

విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త ముట్టే రామచంద్ర రావు మాట్లాడుతూ చేనేతలందరిని ఒక తాటిపైకి తెచ్చేందుకు వెపా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వెపాకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

సమావేశంలో పెండెం శ్రీనివాస్‌, గుంటూరు జిల్లా నుంచి వింజమూరి శ్రీనివాసరావు, మాన్యం వెంకటరమణ, రామనాథం పరమేశ్వర రావు, తిరువీధుల లీలా మాధవరావు, శీలం మల్లికార్జున, మాచర్ల ఆదినారాయణ, శీలం శ్రీనివాసరావు మాధవీ లక్ష్మి, బడతల ప్రభాకర్‌ రావు, కొనిశెట్టి లక్ష్మయ్య దివి చంద్రశేఖర్‌, గుత్తికొండ మురళి, గౌరబత్తిన మోహన్‌ రావు, కోడూరు శివకుమార్‌, నాలి అప్పారావు, గడ్డం లక్ష్మీనారాయణ, టి సుధాకర్‌, ఎన్‌. చంద్రశేఖర్‌, అనంత వెంకట రమణ, మందుల మోహన్‌రావు, కోడి దాసు శ్రీనివాసరావు, కొండపల్లి సతీష్‌ బాబు, కోడూరుశివకుమార్‌ పాల్గొన్నారు.

తాటిపర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. వందన సమర్పణ చేసి సమావేశాన్ని ముగించారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Xtradegrok 8.1 Flex

Follow us on social media

Related posts

Leave a Comment