చేనేతమిత్ర ప్రతినిధి: తిరుపతిలో వివాహ పరిచయ వేదికను పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. తిరుచానూరు రోడ్ శ్రీనివాస పురంలోని పద్మశాలీ భవన్‌లో ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ వందల సంఖ్యలో అబ్బాయిల, అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి. వీటిని చూసేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. పూర్తిగా ఉచితం. అబ్బాయి లేదా అమ్మాయి ఫొటో, వివరాలను నిర్వాహకులకు అందజేస్తే ప్రొఫైల్స్‌లో చేరుస్తారు. ఇటీవల వేదిక నిర్వాహకులు వాట్సప్ గ్రూప్‌లు కూడా ఏర్పాటు చేశారు. అడ్మిన్‌లకు ప్రొఫైల్ పంపితే వారు గ్రూపుల్లో పోస్టు చేస్తారు.
‘‘సంబంధాలు కుదిర్చే విషయంలో మేం ఎలాంటి మధ్యవర్తిత్వం వహించం. అబ్బాయి లేదా అమ్మాయి నచ్చితే, ప్రొఫైల్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకోవాలి. ‘పరిచయం మావంతు పరిశీలన మీవంతు’ – నిర్వాహకులు (అడ్మిన్స్)
ప్రతి ఆదివారం..
తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తారు. ఈ ఆదివారం అంటే ఏప్రిల్ 2వ తేదీ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. కులస్థులు నేరుగా వచ్చి అబ్బాయిల లేదా అమ్మాయిల ప్రొఫైల్స్ ఇవ్వొచ్చు. రాలేని వారు కొరియర్ లేదా పోస్టు ద్వారా గాని పంపవచ్చు.
ఇప్పటి వరకు 51 పెళ్లిళ్లు
‘‘వాట్సప్ గ్రూపుల్లో అబ్బాయిలు, అమ్మాయి ప్రొఫైల్స్ పోస్టు చేయడం ఇటీవలె ప్రారంభించాం. గ్రూపుల్లో మొత్తం దాదాపు 600 ప్రొఫైల్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా ఇప్పటివరకు 51 నిశ్చితార్ధాలు, వివాహాలు జరిగాయి. అందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం’’ – అడ్మిన్స్
1. ఎం. ఓబుళపతి 9247330732,
2. వెంకటేశ్వర్లు 9908836456
3, శ్రీరామ్ మోహన్ 9866708253
4. ఎ. వెంకటసుబ్బయ్య 7901012122
వాట్సప్ గ్రూప్‌లో చేరాలంటే ముందుగా వీరిని సంప్రదించాలి.
వివాహ వేదిక అడ్రస్సు..
పద్మశాలి భవనం,
డోర్ నం. 1-7/1,
శ్రీనివాసపురం,
నందిని బేకరీ అండ్ స్వీట్స్ షాప్,
తిరుచానూరు రోడ్డు , తిరుపతి,
సెల్ నెంబర్ .8317523071.
రైల్వేస్టేషన్ నుంచి బస్ స్టేషన్‌నుంచి సుమారు 2 కిలో మీటర్లలోపు ఉంటుంది. షేరింగ్ ఆటోలో మనిషికి రూ. 20 తీసుకుంటారు.
![]()
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika



