పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీశైలం పద్మశాలి సంఘం

చేనేతమిత్ర ప్రతినిధి: శ్రీరామనవమిని పురస్కరించుకుని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీశైలం పద్మశాలి సంఘం అధ్యక్షులు నారాయణగారి నాగ శేషయ్య ఆధ్వర్యంలో సంఘ సభ్యులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ పూజారి కృష్ణమూర్తి, దేవాలయ కమిటీ సభ్యులు మల్లికార్జున, రమేష్‌, ‌చిన్న తదితరులు వారికి మేళతాళాలతో స్వాగతం పలికారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో పద్మశాలి సంఘం ఏర్పడినప్పటి నుంచి రాములోరి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నామని నాగశేషయ్య ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి గుద్దంటి గోవింద రాజు, ఉపాధ్యక్షులు జంజనం సాంబశివరావు, సహ కార్యదర్శి అవ్వారు శంకర్‌, ‌కారంపూడి నాగేశ్వర రావు, శేషగిరి, సభ్యులు రామలక్ష్మయ్య, కేశవులు, అవ్వారి కామేశ్వర రావు, నక్కా మధు మహిళ సభ్యులు కారంపూడి జ్యోతి పాల్గొన్నారు.

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Tau Portfolix

Follow us on social media

Related posts

Leave a Comment