‘సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేయాలి’

అత్యున్నత పదవుల్లో ఉన్న వారు, ఉన్నత స్థాయిలో స్ధిరపడిన వారు తమ సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేయాలని మదానేగుంది సంస్థాన సరస్వతి పీఠం నాగమూరేంద్ర మహాస్వామిజీ సూచించారు.

బెంగళూరుకు సమీపంలోని పుష్కాండజి మహర్షి (దొడ్డబళ్లాపూర్‌) ఆశ్రమంలో ఇటీవల నిర్మించిన తొగటవీర క్షత్రియ సమాజం కళ్యాణ మంటపం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటితంగా ఉండి సమాజ శ్రేయస్సుకు కులస్థులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇదే కార్యక్రమంలో తొగటవీర క్షత్రీయ కుల గురువు దివ్యజ్ఞానానందగిరి స్వామిజీకి అఖిల భారత తొగటవీర క్షత్రీయ సంఘం ‘బైలా’ కాపీని సంఘం అధ్యక్షులు బిఎస్‌ సోమశేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా శ్రీనివాసులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ జి. నాగరాజు, తాలుకా అధ్యక్షులు బి. రామదాసు, స్థానిక ప్రముఖులు మునిరాజు, ఎం. వరప్రసాద్‌, ఎం. అంబన్న, విజయరాజ్‌, అన్నపూర్ణ, దేవానంద(బళ్లారి), ఎం గోవిందప్ప (చిత్రదుర్గ) తదితరులు పాల్గొన్నారు. Tau Portfolix

Follow us on social media

Related posts

Leave a Comment