ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకుంది.
గుంటూరు జిల్లా తెనాలిలోని ముత్తంశెట్టి పాలెంకు చెందిన జొన్నాదుల వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా చేనేత కార్మికులు. 2021 జనవరిలో మృతిచెందడంతో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. దీంతో తల్లీ కూతుళ్లు పడుతున్న ఇబ్బందులను స్థానిక పద్మశాలీ కులస్థులు పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుల దృష్టికి తెచ్చారు. దీంతో వారు వెంటనే స్పందించారు. అసోసియేషన్ తరపున వెంకటేశ్వరరావు కూతురుకు రూ. 31 వేలు అందజేశారు. కష్టాల్లో ఉన్న మన సంఫీుయులను ఆదుకోవడానికి మన కులస్థులంతా తోడ్పాటు అందించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి జి .సుబ్బారావు, కోశాధికారి టి. నాగేశ్వరరావు, ప్రముఖ జ్యోతిష్యులు కొల్లి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్యాల జ్యోతి, తెనాలి శాఖ సహాయ కార్యదర్శి. పి. శివయ్య, మహిళా కార్యదర్శి పి, లక్ష్మి కుమారి , కార్యవర్గ సభ్యులు జే. శ్రీనివాసరావు, యంవిఎస్ ప్రసాద్. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitkra Maasapatria
