కోరుట్ల డిక్లరేషన్‌ – రాజకీయ తీర్మానాలివే ..

చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్‌:  పద్మశాలి రాజకీయ యుద్ధభేరిలో పలు తీర్మానాలు చేశారు. వాటిలో కొన్నింటిని చదివి వినిపించారు. ఆ వివరాలు యథాతథంగా..

  • పద్మశాలీలను పట్టించుకోకపోయినా, పద్మశాలీల నాయకత్వాన్ని గుర్తించకపోయినా, పద్మశాలీలకు ప్రాతినిధ్యం కల్పించకపోయినా పరవాలేదు అని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీల కళ్ళు తెరిపించాలని ఈ మహాసభ తీర్మానిస్తున్నది.
  • వార్డు మెంబర్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యుడి దాకా అన్ని స్థానాల్లోనూ పద్మశాలీలలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఈ సభ తీర్మానిస్తున్నది.
  • పద్మశాలీల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థానాల్లో, పద్మశాలీల ఎదిగిన నాయకత్వం ఉన్న ఇతర స్థానాలలోనూ కూడా పద్మశాలీలకు రాజకీయ అవకాశాలు కల్పించే రాజకీయ పార్టీలకే పద్మశాలీలు ఇకనుంచి మద్దతుగా నిలుస్తారని ఈ సభ తీర్మానిస్తున్నది.

  • సంఘాలను కలుపుకొని పద్మశాలీలు అంతా ఒకే రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో ఇప్పటి అవకాశం ఇప్పుడే.. మరెప్పుడో కాదు. అని ఈ సభ నినదిస్తున్నది.
  • పద్మశాలీల కన్నా ఎక్కువ సంఖ్యలో ఇతర బీసీ కులాల వారు ఉన్నచోట తోటి బీసీలకు అవకాశం ఇచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఈ సభ తీర్మానిస్తున్నది.
  • పద్మశాలీల నాయకత్వానికి అవకాశాలు కల్పించిన స్థానాల్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలను పక్కనపెట్టి మన వారినే గెలిపించుకోవాలని ఈ పద్మశాలి మహాసభ తీర్మానిస్తున్నది.
  • పద్మశాలీల ఐక్యత వల్లనే, సమైక్య రాజకీయ శక్తి నిర్మాణం వల్లనే మనకు రాజ్యాధికారం లభిస్తుందని గుర్తించాలి. అధికారం ఒకరిస్తే వచ్చేది కాదు, మన సమైక్య శక్తి వల్ల మనం తెచ్చుకుంటేనే వస్తుందని గ్రహించాలి.
  • పద్మశాలి అభ్యర్థులను నిలబెడితే అన్ని రకాలుగా అండగా నిలబడి గెలిపించుకుంటారని నిరూపించాలి. ఎదిగిన నాయకులు కిందిస్థాయి నుంచి కూడా మన యువతరాన్ని ప్రోత్సహించాలి.
  • ఈ రాజ్యాధికారం మన కులబంధువుల సమగ్ర అభివృద్ధి ` సంక్షేమం కోసమే అన్న సిద్ధాంతాన్ని నాయకులు తప్పనిసరిగా గుర్తించుకోవాలి, ఆచరించాలి.
  • పద్మశాలీలను పట్టించుకుంటేనే వాళ్లు మనకు అండగా నిలబడతారు ` పద్మశాలీలను పట్టించుకోకపోయినా, పక్కనపెట్టినా ఓట్లు వేయరు అని మనం నిరూపించాలి? మన సమైక్య రాజకీయ నిర్ణయాత్మక శక్తే మనకు బలం, రాజకీయాలకు అతీతంగా మనం నిర్మించుకునే ఈ రాజకీయ బలమే మనకు వర్తమానం… భవిష్యత్తు ?
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో పద్మశాలీల సంఖ్యాబలం అధికంగా వుంది. గెలుపు ఓటములను తారుమారు చేసేంతగా ఓట్లు ఉన్నా.. ఓటు బ్యాంకుగా మారనంతకాలం గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యం లభించదు.
  • పద్మశాలీల సంఖ్య అధికంగా ఉన్న చోట గాని, పద్మశాలీల ఎదిగిన నాయకత్వం ఉన్న చోట గాని మనవారికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఈ సభ తీర్మానిస్తున్నది.

పద్మశాలీల హక్కు అసెంబ్లీ నియోజకవర్గాలు.
1. కోరుట్ల 2. జగిత్యాల 3. రామగుండం 4 సిరిసిల్ల 5. కరీంనగర్‌ 6. పెద్దపల్లి 7. నిజామాబాద్‌ రూరల్‌ 8. పరకాల 9. బాల్కొండ 10. వరంగల్‌ ఈస్ట్‌ 11. నిజామాబాద్‌ అర్బన్‌ 12. జనగాం 13. ఖమ్మం 14. ముషిరాబాద్‌ 15. ఎల్‌.బి.నగర్‌ 16. మహబూబ్‌ నగర్‌ 17. సంగారెడ్డి 18. గద్వాల
19. సిద్దిపేట 20. నారాయణపేట్‌ 21. నల్లగొండ  22. మునుగోడు
23. భువనగిరి 24. ఆలేరు

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Poland Capital

Follow us on social media

Related posts