గుజ్జ తారకు సన్మానం

చేనేతమిత్ర ప్రతినిధి:‌ రాజన్న సిరిసిల్లా జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ మడుపు రత్నాదేవి రచించిన ఎనిమిది పదులు (కవితా సంపుటి) పుస్తకాన్ని ఆవిష్కరించారు. రత్నాదేవి ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా సిరిసిల్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి గెలిచారు. కమ్యూనిస్టు భావాలున్న భర్త మడుపు రాజరెడ్డి కాలధర్మం చేశాక సిరిసిల్ల సాహితీ సమితిలో చేరారు. అప్పటి నుంచి కవితలు రాయడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు రాసిన కవితలను క్రోడీకరించి ముద్రించిన ‘ఏడుపదులు’ కవితా సంపుటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి సాహితీ అధ్యక్షులు, సభ్యులతో పాటు తెలంగాణ జాతీయ చేనేత ఐక్యవేదిక మహిళ విభాగం అధ్యక్షురాలు గుజ్జ తార కూడా హాజరయ్యారు. అధ్యక్షురాలిని ఎంపిక అయినందున గుజ్జ తారను రత్నాదేవి అభినందిస్తూ శాలువతో సన్మానించారు.

ఇటీవల సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ ‌భద్రాది సీతమ్మకు పట్టు పీతాంబరాన్ని తయారు చేసి సమర్పించారు. హరిప్రసాద్‌ ఆవిష్కరణను అభినందిస్తూ ఇటీవల తెలంగాణ జాతీయ చేనేత ఐక్య వేదిక మహిళ విభాగం అధ్యక్షురాలు గుజ్జతార ఆయనను శాలువతో సన్మానించారు.

 ‌వెల్ది హరిప్రసాద్‌ ‌వివరాల కోసం దిగువన ఉన్న ఫొటోను క్లిక్‌ ‌చేయండి

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Evitraps

Follow us on social media

Related posts

Leave a Comment