ప్రారంభమైన దసరా శరన్నవరాత్రోత్సవాలు, చండీ హోమం

తొలిరోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు..

కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా శరనవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ సారి చండీ హోమానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.

ఆలయ ముఖద్వారం- భద్రావతీ సమేత భావనారాయణ స్వామి

గుర్రం శివశంకర్, భాను ప్రసాద్ దంపతులు
పులిపాటి క్రిష్ణమూర్తి, కోడి నవీన్ దంపతులు
గుండం చుట్టూ దంపతులు
అమ్మవారి పూజలో..
ఆలయ కమిటీ సభ్యులు
ఇస్కాల సత్రానికి చైర్మన్‌గా ఎంపికయిన కస్తూరి వెంకటేష్‌కు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరిస్తున్న కమిటీ సభ్యులు

‘‘హోమానికి అనూహ్య స్పందన’’

ఎర్రనాగు శేషయ్య

‘‘ఏటా దసరా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం తొలిసారి చండీహోమానికి ఏర్పాట్లు చేశాం. శరన్నవరాత్రోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలతో ముద్రించిన ఆహ్వానపత్రికను మన కులస్థుల ఇళ్లలో అందజేశాం. చండీ హోమానికి అనూహ్య స్పందన వచ్చింది. హోమంలో పాల్గొనేందుకు మొత్తం 34 జంటలు తమ పేర్లు నమోదు చేసుకున్నార. తొలిరోజు గుర్రం శివప్రసాద్, ప్రమీల దంపతులు, పులిపాటి క్రిష్ణమూర్తి, లక్ష్మీదేవి దంపతులు, శిరసాల భానుప్రసాద్, శారద దంపతులు, కోడి నవీన్ కుమార్, నళిని దంపతులు హోమంలో పాల్గొన్నారు. వారితో వేదపండితులు ప్రత్యేక పూజలు చేయించారు.’’
– ఎర్రనాగు శేషయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు

చండీ హోమం ఎందుకు చేస్తారు?
హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన హోమాలలో చండీహోమం ఒకటి. ఇది దేవి మహాత్మ్యం (దుర్గాసప్తశతి/చండీ పాఠం) ఆధారంగా చేసే హోమం. ఇందులో దేవి చండీ రూపాన్ని ఆరాధిస్తూ 700 శ్లోకాలతో కూడిన దుర్గాసప్తశతిని చదువుతూ అహుతులు సమర్పిస్తారు. ఈ హోమం చేయడం వల్ల శత్రు దోష నివారణ జరిగి, సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహంతో దుష్టశక్తులు, గ్రహదోషాలు తొలగి, జీవనోపాధి, వ్యాపారంలో రాణిస్తారని వేదపండితులు చెబుతుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఈ హోమం చేస్తారు.

దాతల విరాళాలు..
కొంతమంది దాతలు ఆలయానికి వస్తు రూపేణ సహకరించారు. ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణులు, కర్నూలు డీఎంహెచ్‌వో (రిటైర్డ్) డాక్టర్ యంగల నరసింహులు స్పీకర్ సెట్ అందజేశారు. ఏపీ ట్రాన్స్‌లో డివిజనల్ ఇంజనీర్ (రిటైర్డ్) లయన్ పి. వెంకటేశ్వర్లు LED బల్బులు, వాసి శ్రీనివాసులు ఉడెన్ స్టూల్స్‌ను విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

ప్రసాద వితరణ, అల్పాహారానికి సహకరించిన దాతలు..
కంటివైద్య నిపుణులు డా. చెన్నా ఆంజనేయులు, ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్. శింగరి సంజీవకుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శింగరి అచ్యుతరావు, సాక పవన్ కుమార్, మేడం శ్రీనివాసులు, కస్తూరి చిన్న రంగస్వామి, పులిపాటి శంకరయ్య, పులిపాటి గిరి, నామాల నారాయణ ఆర్య, మేడం శ్రీనివాసులు, శిరసాల రాజేష్, పైడి వీరస్వామి, సాందాపు కళాధర్, గుడిపాటి కిషోర్, గంజి సుబ్బలక్ష్మి, వగ్గా పద్మావతమ్మ, సేపూరి సురేష్, బర్రెంకల నాగేశ్వర రావు, నూకల కోదండ రామయ్య, పులిపాటి క్రిష్ణయ్య, వన్నాల వంశీకృష్ణ, పుట్టా ప్రమీలమ్మ .

స్వామి అమ్మవార్ల వస్త్రాలంకరణకు సహకరించిన దాతలు..
యర్నాగు శేషయ్య, తిరువీధుల వెంకటేశ్వర్లు, కోడి మోహన రాముడు, అవ్వారు శివశంకర్, శిరసాల లక్ష్మినారాయణ, కస్తూరి పెద్ద రంగస్వామి, జేరుబండి హరిప్రసాద్, కాల్వ సంజీవ్, తిరువీధుల ప్రభాకర్, మాకం రామయ్య. True Ledgewick

Follow us on social media

Related posts