‘PBN Meet GRAND SUCCESS..’

హైదరాబాద్‌: ఇటీవల బేగంపేట రోడ్‌లోని హోటల్ గ్రీన్‌పార్క్‌లో నిర్వహించిన పద్మశాలీ బిజినెస్ నెట్‌వర్క్ (PBN) సమావేశం విజయవంతమైందని చైర్మన్ వర్కాల బాలాజీ తెలిపారు. ఈ మీట్‌కు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 మంచి వ్యాపారులు వచ్చారని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 9న వరంగల్ జిల్లా హనుమకొండలో నిర్వహించిన PBN meet కూడా సక్సెస్ అయ్యిందన్నారు. సమావేశానికి హాజరయిన అతిథులు బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ ఎం. వేణు కళ్యాణ్, TED ‘X’ స్పీకర్ డా. రిత్విక్‌కు, మీట్ విజయవంతానికి కృషిచేసిన PBN కోర్ కమిటీ సభ్యులు రామ్ తిరుమల, శంకర్ గుత్తి, నాగార్జున నేత, సీహెచ్ ప్రభాకర్, సీహెచ్ రచనకు ధన్యవాదాలు తెలిపారు.

ఎం. వేణు కళ్యాణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యాపారాభివృద్ధికి సలహాలు ఇచ్చారు. డా. రిత్విక్ కూడా వ్యాపారులనుద్దేశించి ప్రసంగించారు.

వ్యాపార సూత్రాలను చెబుతున్న వేణు కళ్యాణ్..

‘‘జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్’’

  • వ్యాపారంలో రాణించే వ్యక్తికి ‘‘GOAL, PURPOSE’’ ఉండాలి. ఈ రెండు లేకపోతే రాణించలేం. అంతకంటే ముందు ‘‘DETERMINATION, DEDICATION, CONFIDENCE’’ ఉండాలి. రిస్క్ లేని జాబ్ లేదు. ఇదే అభిప్రాయంతో ఉండాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. 80% ఎఫర్ట్స్ పెడితే.. 20% రిజల్ట్స్ వస్తున్న రోజులివి.
  • సాధ్యమయినంతవరకు మీ ప్రాడక్టుకు బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. వ్యాపారాభివృద్ధికి బ్రాండ్‌ సహకరిస్తుంది. బ్రాండింగ్‌తో డిసౌంట్లు అడగడం తగ్గుతాయి.
  • మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఎంత నాణ్యమయిన ప్రాడక్టు అయినా వృథానే.. కస్టమర్ల కాల్స్‌కు వెంటనే స్పందించండి.. వారు అడిగే ప్రశ్నలకు క్లారిటీగా, కాన్ఫిడెంట్‌గా జవాబు ఇవ్వండి.
  • ప్రాడక్టు సేల్స్‌కు మార్కెంటింగ్ స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా కాంటాక్ట్స్ ఉండాలి. బిజినెస్ గ్రోత్ మనకున్న కాంటాక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది.
  • ఓవర్ థింకింగ్‌కు దూరంగా ఉండండి. అలాగని నిర్లక్యంగా కూడా ఉండకండి. మీరు చేస్తున్న వ్యాపారంపై ఫోకస్ పెడుతూనే కాంపిటీటర్‌పై ఓ కన్నేసి ఉంచండి.
  • కొత్త విషయాలు (మార్కెటింగ్ స్ట్రాటజీస్) నేర్చుకోడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారాభివృద్ధికి అప్‌గ్రేడేషన్ చాలా అవసరం. టెక్నాలజీ వాడుకుని అప్‌గ్రేడ్ అయిన వాళ్లు మాత్రమే రేస్‌లో నిలుస్తారు. రాణిస్తారు. ఇవన్నీ మీ వద్ద ఉంటేనే.. ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడం సాధ్యం.
  • ‘‘I DON’T TAKE PERFECT DESICION. I JUST TAKE DESICION AND MAKE IT PERFECT ’’ అన్న రతన్ టాటా మాటలను ఆచరణలో పెట్టాలని సూచించారు వేణు కళ్యాణ్.  
వ్యాపారులనుద్దేశించి ప్రసంగిస్తున్న డా. రిత్విక్‌

PBN Next meet..
PBN తరువాతి సమావేశానికి వేదిక ఖరారైంది. అక్టోబర్ 10వ తేదీ కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్నట్లు చైర్మన్ వర్కాల బాలాజీ(Varkala balaji) తెలిపారు.

PBN చైర్మన్ వర్కాల బాలాజీ

PBN ముఖ్యోద్దేశం..
ఇది పద్మశాలీ వ్యాపారుల కనెక్టివిటీ కోసం ఏర్పాటయిన వేదిక. అవకాశం ఉన్న చోట వ్యాపారాల విస్తరణ, పరస్పర సహకారంతో ఎదగడం కోసం ఏర్పాటయిన సమూహం. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు, దూరదృష్టి గల వ్యక్తుల సహకారంతో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్థాపించిన సంస్థ PBN.

చిత్రమాలిక..

హాజరయిన వ్యాపారులు

Zeltix AI

Follow us on social media

Related posts