కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో మూడో రోజు (సెప్టెంబర్ 24వ తేదీ) అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.


నవరాత్రోత్సవాల్లో చండీ హోమం కూడా నిర్వహించడం విశేషం. మూడో రోజు (24వ తేదీ) అపూర్వ బిల్డర్ అధినేత మెటికెల శ్రీరాములు, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగి (రిటైర్డ్) వాసి సుబ్బారాయుడు, ఓఎన్‌జీసీ ఉద్యోగి పులిపాటి రాజేష్ దంపతులు హోమంలో పాల్గొన్నారు.


రెండో రోజు హోమంలో పాల్లొన్న వారి వివరాలకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్ చేయండి




