కొత్త జీఎస్టీ లెక్కలు.. నేతన్నకు మిగిల్చే కష్టాలు..

హైదరాబాద్ : దేశంలో వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ విధానం చూస్తుంటే పెన్నంలోంచి పొయ్యిలో పడ్డట్టుంది. ఈ పరిస్థితిపై తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఏమంటున్నారంటే..

రాపోలు వీరమోహన్..

‘‘కొత్త జీఎస్టీ విధానం చేనేత పరిశ్రమకు గొడ్డలిపెట్టు. వస్తుసేవల పన్ను(GST)లో విప్లవత్మక మార్పులను తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం.. చేనేత వస్త్రాలపై 5 శాతం ఉన్న జీఎస్టీని, ఏకంగా 18 శాతానికి పెంచి చేనేత మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చేసింది. రూ. 2,500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత ఇతర వస్ర్తాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి పెంచింది. రూ. 2,500 కంటే తక్కువ ధర ఉండే వస్ర్తాలకు, రెడీమేడ్‌ దుస్తులకు జీఎస్టీని 5 శాతంగా నిర్ణయించింది.

చేనేత చీర ధర రూ.2,500 లోపు ఉండడం చాలా తక్కువ. కంచి, బెనారస్, పోచంపల్లి, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల రకాలు రూ.2,500లకు పైగానే ఉంటాయి. దాంతో చేనేత వస్త్రాలపై 18 శాతం జీఎస్టీ పడుతుంది. ఇక మెషీన్‌పై తయారు చేసిన నాసిరకం చీరలు తక్కువ ధరకు లభించడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తారు. ఎటొచ్చి నష్టపోయేది నేతన్నే. జీరో జీఎస్టీ అమలు చేయాలని గత కొంతకాలంగా ఉద్యమాలు చేస్తుంటే.. నేడు కొత్తగా తెచ్చిన జీఎస్టీ విధానాలతో లక్షలాది చేనేత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 18 శాతం జీఎస్టీ‌ని జీరో జీఎస్టీ చేయకపోతే చేనేత వర్గాల నుంచి ఆందోళనలు, నిరసనలు తప్పవు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. Vertex Inviolex

Follow us on social media

Related posts