హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి ఇంజనీర్స్ విభాగ సంఘం (ఏబీపీఇవీఎస్) 2023 డైరీని ముద్రించనుంది. గత ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా డైరీ లోపలి పేజీల్లో ప్రకటనలు (అడ్వర్‌టైజ్‌మెంట్) ముద్రించనున్నారు. అందుకోసం ప్రకటనదారులకు ఆహ్వానం పలుకుతోంది.
ప్రకటనల సైజు – విలువ ఇలా ఉన్నాయి..
ఎ) మొదటి రెండు పేజీలు (లోపల): రూ.25,000/` ఒక్కొక్కటి.
బి) చివరి రెండు పేజీలు (లోపల): రూ. 20,000/` ఒక్కొక్కటి.
సి) పూర్తి పేజీ: రూ.10,000/` ఒక్కొక్కటి
డి) సగం పేజీ: రూ.5,000/` ఒక్కొక్కటి
ఇ) 1/5 పేజీ: రూ.3,000/` ఒక్కొక్కటి
ప్రకటనల కోసం డబ్బులు చెల్లించేవారు ‘పద్మశాలి ఇంజనీర్స్ అసోసియేషన్ (ఇండియా)‘ పేరున చెక్కు రూపంలో ఇవ్వవచ్చు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించేవారు ఖాతా నం. 013210100114531, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: 0801321. బ్యాంక్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్: బాగ్ అంబర్‌పేట్ అని అసోసియేషన్‌కు పంపవచ్చు.

2022 డైరీని ఆవిష్కరించిన సుంకుర్వార్
అఖిల భారత పద్మశాలి సంఘం ఇంజనీర్స్ విభాగం డైరీని గతేడాది అప్పటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్ ఎన్ సుంకుర్వార్ ఆవిష్కరించారు. జనవరి 26, 2022న నారాయణగూడ పద్మశాలి భవన్‌లో ఇంజనీర్స్ విభాగం జాతీయ అధ్యక్షుడు పుట్ట పాండురంగయ్య అధ్యక్షతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, ఇంజనీర్స్ విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణు మాధవ్, ప్రధాన కార్యదర్శి మసున మోహన నారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, యువజన విభాగం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, హ్యాండ్లూమ్ విభాగం అధ్యక్షులు ఎర్రమద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


