

ఇటీవల ఆదోనిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదోని పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని పద్మశాలి మహిళా సేవా సంఘం కార్యవర్గ సభ్యులను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు గుర్రం క్రిష్ణవేణి, లక్ష్మీ, శిరసాల శివరంజని, చిలక సక్కుబాయి, జేరుబండి అనసూయ, పద్మశాలియులు పాల్గొన్నారు.
