సంకల్ప బలం చాలా గొప్పది: మాజీ ఎంపీ బుట్టా రేణుక

ఆత్మవిశ్వాసానికి సంకల్ప బలం తోడైతే అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని కర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుక అన్నారు. కర్నూలు నగరం రోజా వీధిలోని మణి మదీన మహిళ సంక్షేమ సంఘం స్థాపించి అక్టోబర్‌ 24వ తేదీకి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా సంస్థ మొదటి వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ సభ్యుల సంఖ్య 200దాకా పెరగడం తనకు గర్వంగా ఉందన్నారు. ఎంపీగా ఉన్నపుడు తాను ఎన్నో ప్రజా ప్రయోజక కార్యక్రమాలు ఏర్పాటు చేయించానని, ప్రస్తుతం బుట్టా ఫౌండేషన్‌ ద్వారా వాటిని కొనసాగిస్తున్నామని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ సంస్థ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖాజీ అబ్దుల్‌ సలాం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తూ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించి, మహిళలు తమ కాళ్ల మీద తామే నిలబడేలా చేయడం అభినందనీయమన్నారు. సంస్థకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయన్నారు. రెండో బెటాలియన్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా మాట్లాడుతూ సంస్థతో తనకు అనుబంధం ఉందన్నారు. సంస్థ సభ్యుల వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం నైస్‌ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత రాయపాటి శ్రీనివాస్‌, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి మారుతి శర్మ మాట్లాడారు. మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మణి మాట్లాడుతూ గత సంవత్సరం బుట్టా రేణుక ఎంపీ హోదాలో తమ సంస్థ ఏర్పాటుకు ఎంతో సహకరించారని, వారి సహాయం మరువలేనిదని అన్నారు. టైలరింగ్‌లో ఇప్పటికే చాలా మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, 15 మందికి ఉచితంగా టైలరింగ్‌ మిషన్లు అందజేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు కర్నూలు జిల్లాలో చూడగలరు Kuu Arvostus

Follow us on social media

Related posts

Leave a Comment