నంద్యాల పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు

నంద్యాల పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో భద్రావతి భావనాబుషి కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. శరన్నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజ కార్యకమ్రాలు నిర్వహించనున్నారు.

నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

  • ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి పద్మశాలీ కులపెద్దలు, మహిళలచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి పాటలు ఏర్పాటు చేశారు.
  • అక్టోబర్‌ 3 నుంచి 7వ తేదీ వరకు రోజు సాయంత్రం 6 గంటల నుంచి చిన్నారుల జానపద, భరతనాట కార్యక్రమాలు, దసరా పండుగ విశిష్టతను తెలిపే వేషధారణలు, నృత్య కార్యక్రమాలు ఉంటాయి.
  • అక్టోబర్‌ 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు వివిధ పోటీలో విజేతలైన చిన్నారులకు మహిళా కమిటీ సభ్యులు బహుమతుల ప్రదానం ఉంటుంది. అనంతరం కులపెద్దలు, నంద్యాల పట్టణ పద్మశాలీ సంఘం, కమిటీ సభ్యులు, నంద్యాల పట్టణ పద్మశాలీ మహిళా సేవా సమితీ సభ్యులు, కులస్థులు కలిసి శమీవృక్ష, స్వామి అమ్మవార్ల పూజలో పాల్గొనడం. అదే రోజు సాయంత్రం 6గంటలకు గ్రామోత్సవం ఉంటాయి.
  • అక్టోబర్‌ 3 నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

మార్కండేయ స్వామి దీక్షమాలధారణ

‘మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా 2020 జనవరి 27వ తేదీ తెల్లవారుజామున భద్రావతి భావనాబుషి దేవాలయంలో శివభక్త మార్కండేయ దీక్ష ధారణ ప్రారంభమవుతుంది. దీక్ష తీసుకునే వారు పసుపురంగు దుస్తులు, కాషాయ వర్ణం కండువ, రుద్రాక్షమాల ధరించాల్సి ఉంటుంది. తిరిగి మార్చి 7, 2020తో మాలధారణ పూర్తవుతుంది. ఆ రోజు రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గోదావరి నదీ తీరాన ఉన్న శివభక్త మార్కండేయ స్వామి ప్రతిష్ఠించిన ఉమా మార్కండేశ్వరస్వామి దేవస్థానంలో మాల విరమణ చేయవచ్చు. ఆసక్తి గల పద్మశాలీ కులస్థులు మార్కండేయ స్వామి దీక్ష తీసుకోవచ్చు’ అని నంద్యాల పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు తెలిపారు. BTC Genix V7.2

Follow us on social media

Related posts

Leave a Comment