
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అయ్యప్ప కొండపై శివమార్కండేయ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది. 2500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమవుతోన్న ఈ ఆలయానికి ఫిబ్రవరి 7, 2019లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే స్థలంలో ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పద్మశాలి కళ్యాణ మండపం, అనాథ, పేద విద్యార్థులకు కోసం వసతి గృహం, నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని నిర్మాణకర్తలు భావిస్తున్నారు. వీటి నిర్మాణాలకు దాతల సహకారం అవసరం.
దాతలు సహకరించాలి
‘పద్మశాలి కులస్థులకు అన్ని వసతులతో కళ్యాణ మండపాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ప్రతి ఏటా 11 మంది పద్మశాలి పేద ఆడపిల్లలకు శివ మార్కండేయ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా వివాహాలు చేయాలనుకుంటున్నాం. అన్ని సౌకర్యాలతో వసతి గృహ నిర్మాణం, నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వందమంది మహిళలు, యువతీ, యువకులకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ, హ్యాండ్‌లూం డిజైనింగ్, సాప్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇప్పించాలని ఉంది. ఫలితంగా వారు జీవితంలో త్వరగా స్ధిరపడేందుకు అవకాశం ఉంటుంది. వసతి గృహ, నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణానికి దాతల సహకారం చాలా అవసరం. రూ. 50 లక్షల విరాళం ఇచ్చే వారి పేరు కళ్యాణ మండపానికి పెడతాం. ఆలయ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటికే చాలామంది దాతలు స్వచ్ఛందంగా తమకు తోచినంత ఆర్థిక సాయం చేశారు. వారికి ధన్యవాదాలు. ఇంకా ఆలయ గోపుర నిర్మాణానికి దాదాపు రూ. 9లక్షలు, గ్రానైట్ కొనుగోలుకు రూ. 3లక్షల దాకా ఖర్చవుతుంది. దాతలు సహకరిస్తే ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తాం. దాతలు చెక్కురూపంలో లేదా సంఘం బ్యాంకు అకౌంట్‌లోకి నేరుగా తమ విరాళాన్ని జమచేయవచ్చు.”
-మాచ ప్రభాకర్ రావు, చైర్మన్, శివ మార్కండేయ ట్రస్టు.
బ్యాంకు వివరాలు:
శివ మార్కండేయ టెంపుల్ కమిటీ,
ఎపీజీవిబీ, మెట్టుగడ్డ బ్రాంచ్,
మహబూబ్‌నగర్.
అకౌంట్ నంబర్: 73153896270,
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎపీజీవీ0007101.
విగ్రహ ప్రతిష్ఠ:
2019 నవంబర్ 8,9,10 తేదీల్లో మహాబలిపురంలో చెక్కించిన శివలింగం, మార్కండేయుడు, నంది, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, నవగ్రహాలు, కాలభైరవుడు, నాగదేవతలు, ద్వారా పాలకుల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ మూడు రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పద్మశాలీలంతా కుటుంబసమేతంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాచ ప్రభాకర్ రావు కోరుతున్నారు.
ప్రభాకర్ రావు గురించి:
మాచ ప్రభాకర్ రావు మహబూబ్‌నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ అక్టోబర్ 31, 2018న రిటైరయ్యారు. 1984లో ఉద్యోగంలో చేరారు. 1986లో వివాహమైంది. భార్య వాణి ప్రభుత్వ ఉపాధ్యాయిని. వీరికి కొడుకు, కూతురు సంతానం. కుమారుడు, కోడలు స్టాఫ్‌వేర్ రంగంలో స్థిరపడి యుఎస్‌ఏలో ఉంటున్నారు. కూతురు వైద్యురాలు. అల్లుడు పారిశ్రామిక వేత్త. ఆలయ నిర్మాణానికి మాచ ప్రభాకర్ రావు తన వంతుగా రూ. 10లక్షలు విరాళం ఇచ్చారు. భార్య పేరున మరో రూ. 2.50లక్షలు ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 12.50లక్షలు విరాళంగా ఇచ్చారు. కళ్యాణ మండప నిర్మాణానికి మరో రూ. 12.50 లక్షలు ఇవ్వనున్నారు. BTC Genix V7.2


