ఎట్టకేలకు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేనేతల అభ్యున్నతికి కీలక నిర్ణయం తీసుకుంది. 38 చేనేత కులాల అభివృద్ధి కోసం కర్ణాటక రాష్ట్ర నేత కులాల అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఇటీవల జీవో జారీ చేసింది. వృత్తి వెలుపల ఉన్న చేనేత కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎలాంటి ప్రభుత్వ పథకాలు లేకపోవడంతో.. నేత కులాల డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కర్ణాటకలో చేనేతలు చాలాకాలంగా డిమాండ్‌ ‌చేస్తున్నారు. కర్ణాటకలో 38 చేనేత కులాలకు సంబంధించి 40 లక్షల జనాభా ఉంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటుకు జీవో విడుదల చేసింది. ఇది చేనేత, నేత కులాల సమిష్టి విజయంగా చెప్పుకోవాలి. కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి బస్వరాజ్‌ ‌బొమ్మైకి పలువురు చేనేత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత ఆయనకు ఉత్తరం రాశారు. భవిష్యత్తులో కూడా నేత కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. కార్పొరేషన్‌ ‌ద్వారా నేత కులాలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు చేనేత సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్‌ నంబర్‌ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది. 

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Baltic Capital

Follow us on social media

Related posts

Leave a Comment