ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తమ కులస్థుల జనగణనకు శ్రీకారం చుట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం అండగుండల గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అసలు జనాభాలో తమవారి సంఖ్య ఎంతో తెలిస్తే రాజకీయాల్లో తమకు సముచిత స్థానం దక్కుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జనగణన కార్యక్రమానికి గ్రామాల్లో కులస్థులు సహకరించాలని సంఘం నాయకులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జనగణన పూర్తయ్యింది. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మన్నెముద్దు శ్రీనివాసులు, అసోసియేట్ సభ్యులు శీతా చెంచుకృష్ణ, మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు, స్థానిక ఏరియా కార్యదర్శులు వెలుగోటి దేవేంద్ర ప్రసాద్ (ఉపసర్పంచ్ భర్త), పిచ్చిక వీర రాఘవులు, పిచ్చిక వాసు, గుత్తి తుకారాం, పిచ్చిక రాము, గట్టు మురళి, పిచ్చిక వెంకటేశ్వర్లు(సాయి), పెరిశెట్ల శ్రీనివాసులు, పిచ్చిక చిన్న కుప్పయ్య, పృథ్వి ఈశ్వర బాబు, గుత్తి తిలక్ పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి పురోహితులు పిచ్చిక భాస్కరయ్య అర్చన చేసి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

![]()
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

