12‌న తుంటినొప్పికి ఉచిత వైద్య శిబిరం

సాధారణంగా వయసు పైబడిన వారిలో తుంటి ఫ్రాక్చర్స్‌ను ఎక్కువగా గమనిస్తుంటాం. ఎముకల సాంద్రత తగ్గడం లేదా కండరాల్లో బలం తగ్గడం వల్ల ఈ ఫ్రాక్చర్స్ ‌సంభవిస్తాయి. తుంటి ఫ్రాక్చర్స్‌కు సర్జరీ తప్పనిసరి. ఆపరేషన్‌ ‌చేయించుకోవడం వల్ల మునుపటిలాగే తమ పనులు తాము చేసుకోగలరు. తుంటి నొప్పితో బాధపడుతున్న వారిని కర్నూలులోని ఆపిల్‌ ‌హాస్పిటల్‌ (‌మౌర్య ఇన్‌ ‌హోటల్‌ ‌దగ్గర)లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వైద్య శిబిరానికి హాజరయ్యే వారికి అనుభవజ్ఞులైన వైద్యులు పరీక్షిస్తారు. ఉచితంగా ఎక్స్‌రే, రక్త పరీక్షలు నిర్వహిస్తారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ పథకం కింద ఆపరేషన్లు కూడా చేస్తారు.

మన శరీరంలో వివిధ భాగాల్లో వచ్చే నొప్పిని బట్టి కొందరు ఎముకల వైద్యుడిని సంప్రదిస్తుంటారు. పరీక్షించిన వైద్యుడు మందులను రాసి ఇస్తారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీని రెకమెండ్‌ ‌చేస్తారు. ఇక ప్రమాదాల్లో ఎముకలు దెబ్బతిన్న వారికి, సర్జరీ చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తప్పనిసరి. ఈ ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేయాలి.. వాటి వల్ల లాభాలను వీడియోలో చూయించారు. యూట్యూబ్‌ ‌వీడియోను వీక్షించేందుకు దిగువన ఉన్న ఫొటోపై క్లిక్‌ ‌చేయండి. Tau Portfolix

Follow us on social media

Related posts

Leave a Comment