యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ సమావేశం ఈ నెల 12వ తేదీ (ఆదివారం) నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ సమావేశం ఈ నెల 5న జరపాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల 12వ తేదీకి వాయిదా వేశారు. యాదగిరిగుట్టలోని పద్మశాలి భవన్లో ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. జిల్లా కార్యవర్గంతో పాటు అన్ని మున్సిపాలిటీలోని అధ్యక్ష కార్యదర్శులు, మండల అధ్యక్ష కార్యదర్శులు, సహకార సంఘాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకావాలని కమిటీ జిల్లా అధ్యక్షులు చిక్కా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
సమావేశంలో చర్చించే అంశాలివే..
‘‘సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నాం. జిల్లాలోని మండలాలు, మునిసిపాలిటీల పరిధిలో కమిటీల కార్యక్రమాల గురించి తెలుసుకుంటాం. కొన్ని మండలాల్లో కమిటీల కాలపరిమితి ముగిసింది. అలాంటి మండలాల్లో కొత్త కమిటీ ఎన్నిక గురించి చర్చిస్తాం. జిల్లాకు సంబంధించి నిర్దిష్ట పద్మశాలీ ఓటర్ల సంఖ్యను తెలుసుకునేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తాం. అలాగే పద్మశాలీ పేద విద్యార్థుల చదువుకు ఏ మేర సాయపడగలం.. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రోత్సహించే అంశాలపై కూడా చర్చిస్తాం. కొన్ని కమిటీల్లో సభ్యులు రాష్ట్ర కమిటీలోకి వెళ్లారు. వారి స్థానంలో కొత్త వారి నియామకంపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటాం.’’

-చిక్కా వెంకటేశ్వర్లు,
యాదాద్రి భువనగిరి జిల్లా పద్మ శాలి సంఘం అధ్యక్షులు.
![]()
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


