కర్నూలు జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీ (ఆదివారం) కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్లే జాతీయ రహదారి పక్కన ఉన్న మయూరి గ్రీన్ ల్యాండ్స్‌లోని స్వయంభు శ్రీ అభిష్ఠ జ్ఞాన గణపతి దేవస్థానంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
కార్యక్రమానికి కులస్తులంతా హాజరుకావాలి
‘‘వన భోజన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలనుకున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమం గురించి కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. కరపత్రాలు కూడా ముద్రించి కులస్థులకు సమాచారం ఇస్తున్నాం. 28వ తేదీ ఉదయం 9.30లకు చౌడేశ్వరీ దేవి అమ్మవారి స్మరణతో కార్యక్రమం మొదలవుతుంది. 10 గంటలకు బాలబాలికలు, మహిళలకు ఆటలు, పాటలు పోటీలు ఉంటాయి. నృత్యప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. 11 గంటలకు జిల్లాలోని కులబాంధవుల పరిచయ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు అతిథుల సందేశం, 1.30 నుంచి 2.30 గంటల వరకు భోజనాలు వడ్డిస్తారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులు అందజేస్తాం. సాయంత్రం 5 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుంది.”
– అక్కెం నరహరిదాస్, కర్నూలు జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు.
ప్రజా ప్రతినిధులకు సన్మానం
‘‘2021లో ఎన్నికయిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, అలాగే 2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను ఈ కార్యక్రమంలో సన్మానించనున్నాం. కార్తీక వన భోజన కార్యక్రమ నిర్వహణకు కులస్థులు, దాతలు సహకరించాలని కోరుతున్నాం. ఆర్థిక సాయం చేసే వారు మమ్మల్ని (9440756255, 9849360168, 9490130987) సంప్రదించవచ్చు. నేరుగా బ్యాంకు అకౌంట్ ( ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నంబర్. 110710100171785)లోనైనా జమ చేసి సమాచారం ఇవ్వవచ్చు.’’
– గుంపు వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.




website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitkra Maasapatria Best online casino Canada real money
