


చౌడేశ్వరీ దేవి జ్యోతి మహోత్సవాన్ని కర్నూలులోని కేసీ కెనాల్ పక్కనున్న మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ 17వ తేదీ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 5.30 గంటలకు అభిషేకం, లక్షబిల్వార్చన, కుంకుమార్చన, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అమ్మవారి జ్యోతి మహోత్సవం నిర్వహించారు. మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ, కర్నూలు జిల్లా జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘం సారధ్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో చౌడేశ్వరీ స్తోత్రం ఉచ్చరిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహోత్సవంలో తొగటవీర క్షత్రియ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత శ్రీనివాసులు, సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెం నరహరిదాసు, ప్రధాన కార్యదర్శి గుంపు వెంకటేశ్వర్లు, శ్రీశైలం చౌడేశ్వరి దేవి నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి మాదం శ్రీనివాసులు, కోశాధికారి సింహాన్ని మద్దయ్య, డీఎస్పీ బొమ్మిశెట్టి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు వంకం వెంకటరమణ, ఇట్టే కృష్ణయ్య , రంగం మురళి, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు రంగం లక్ష్మణదాస్ , జిల్లా నాయకులు పాణ్యం నాగరాజు, మఠం వెంకటస్వామి, విజయభాస్కర్, బదినేహాల్ ఆంజనేయులు, అక్కెం చంద్రశేఖర్, అక్కెం రామకృష్ణ, గంగరాజు, పి బాలకృష్ణ, మాదం జనార్ధన్, పి.వాసు, జి. బాలకృష్ణ, స్వామి, మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, గుంపు శంకరయ్య జ్యోతి బృందం, జల్లు శేషయ్య, గుంటుముక్కల శ్రీకాంత్, అక్కెం విశ్వనాథం, నన్నూరు శ్రీ చౌడేశ్వరి దేవి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

చేనేతమిత్ర మాసపత్రిక
చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్ నంబర్ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది.
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Croft Tradstead
