పార్లమెంట్ మాజీ సభ్యులు, ప్రజా బంధు ప్రగడకోటయ్య 107వ జయంతిని ప్రకాశం జిల్లాలో జూలై 26న ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు చీరాలలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, మాజీమంత్రి డా. పాలేటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డా.వరికూటి అమృతపాణి,రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, చీరాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు,రాష్ట్ర బలహీన వర్గాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, పద్మశాలీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చీరాల శాఖ అధ్యక్షులు డా.గుద్దంటి పున్నారావు హాజరవుతారని ప్రగడ కోటయ్య యూత్ వాలంటరీ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు దామర్ల శ్రీకృష్ణ, ప్రధాన కార్యదర్శి చుండూరు వాసు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేనేతలంతా హాజరై జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
-చీరాల నుంచి చేనేతమిత్ర ప్రతినిధి అవ్వారు వెంకటేశ్ బాబు
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika
చేనేతలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ నంబర్ 83338 71117కు పంపగలరని మనవి. Poland Capital
