బుట్టా ఫౌండేషన్ అధ్వర్యంలో కర్నూలులోని కేవీఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విజయ భారతి రెడ్ జోన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే 15వ తేదీ కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కర్నూలు నగరం సి.క్యాంపు సెంటర్, గణేష్ నగర్, సోమిశెట్టి నగర్, శ్రీరామ్ నగర్, మద్దూర్ నగర్, గాయత్రి ఎస్టేట్, బిర్ల గడ్డా ప్రాంతాల్లో పనిచేస్తున్న 100 మంది పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 10 గుడ్ల చొప్పున అందజేశారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండడం కోసం బుట్టా ఫౌండేషన్ కోడిగుడ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ , ప్రతినిధులు చెన్నప్ప, మోహన్ కృష్ణ పాల్గొన్నారు. Ampla Tesouròs
Related posts
-

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి ‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’
ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ... -
పద్మశాలి విద్యార్థులకు ఆర్థిక సాయం
చేనేతమిత్ర, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద పద్మశాలి విద్యార్థులకు పంతం చక్రపాణి దంపతులు రూ. 1,05,000 ఆర్థిక... -
టెండర్ విధానంతో నేతన్నల బతుకుకు క(న)ష్టం..
చేనేతమిత్ర, హైదరాబాద్: మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని...