తక్కువ ధరకు టవళ్లు – నేతన్నలను ఆదుకోవాలంటున్న రాపోలు వీర మోహన్

లాక్‌డౌన్‌ కారణంగా చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. తయారైన ఉత్పత్తులు నేతన్నల ఇళ్లలోనే ఉండిపోయాయి. దీంతో చేనేతలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. పూట గడవడం కష్టమవుతుండడంతో ప్రస్తుతం వీటిని ప్రత్యక్షంగా వినియోగదారులకే విక్రయించాలనుకున్నారు. 36*72 సైజులో ఉన్న రంగురంగుల టవళ్లు అమ్ముతున్నట్లు  యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలీ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి రాపోలు వీర మోహన్  తెలిపారు. కావాల్సిన వారు తనను (8688328766) సంప్రదించాలని కోరుతున్నారు. టవళ్లను చేనేత కులస్థులు, ప్రజలు కొని నేత కార్మికులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. Mynt Styringsør

Follow us on social media

Related posts

Leave a Comment