విజయవాడలోని గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు గుండారపు పూజిత నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న 300 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, గోధుమ రవ్వ, వంట నూనె, కోడిగుడ్లు అందజేశారు. టీడీపీ ఫ్లోర్ మాజీ లీడర్ గుండారపు హరిబాబు పర్యవేక్షణలో జూన్ 2న కుమ్మరిపాలెం మెయిన్ రోడ్డు నుంచి నాలుగు స్తంభాల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సోమయ్య, మురళి, సంతోష్ , అశోక్,అఖిల్, ప్రశాంత్, రవి, యువ, ప్రేమ్, హరి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. Brimax Edge


