ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల రెండు రోజుల పాటు కర్నూలు జిల్లా పరిషత్ ఆవరణలో శిబిరం ఏర్పాటు చేశారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన చేతి కర్రలు, కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, కంటి అద్దాలు, మూడు చక్రాల బండ్లు పంపిణీకి వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ తరుపున మేనేజర్ రాజేష్ పాల్గొని ప్రసంగించారు. ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. Κεντρο Luxorion
విభిన్న ప్రతిభావంతులకు చేయూత
