బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం – నిరాశ్రయ మహిళల ఆశ్రమ నిర్వాహకురాలు శకుంతలకు సన్మానం

బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 13వ తేదీ కర్నూలులో ఘనంగా నిర్వహించారు. దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని  నిరాశ్రయ మహిళల  ఆశ్రమంలో నిర్వాహకురాలు గోరంట్ల శకుంతలను సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ చరిత మాట్లాడుతూ స్త్రీ అభ్యున్నతికి కృషిచేసిన స్వాంతత్య్ర సమర యోధురాలు  సరోజిని నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నిరాశ్రయ మహిళలకు వసతి, ఉపాధి కల్పిసున్న రాయలసీమ మహిళ సంఘం అధ్యక్షురాలు  శకుంతలను సన్మానించడం గర్వంగా ఉందన్నారు. శకుంతల  మాట్లాడుతూ మహిళలు, యువతులు, చిన్నారులపై ఇటీవల  లైంగిక దాడులు పెరిగిపోయాయని, వాటిని అందరూ ఖండించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పల్లెలో నేటికీ అక్కడక్కడా బాల్యవివాహాలు  జరుగుతుండడం దురదృష్టకరమన్నారు. వాటివల్ల  జరిగే అనర్థాల  గురించి బాలిక తల్లిదండ్రులకు  పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ హేమలత  పాల్గొన్నారు. Kärna Fintrix

Follow us on social media

Related posts

Leave a Comment