ఆగస్టు 7న ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం – సన్నాహాలపై చేనేత వర్గాల అభిప్రాయాలు సేకరించిన ఏపీవెపా

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న ఘనంగా నిర్వహించేందుకు ఏపీ వీవర్స్ ఎంప్లాయిస్‌ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌ (ఏపీవెపా) సన్నాహాలు చేస్తోంది. వేడుకల నిర్వహణపై అసోసియేషన్‌ జూలై 29వ తేదీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వివిధ జిల్లాల నుంచి చేనేత సమాజంలోని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శేషయ్య మాట్లాడుతూ చేనేత దినోత్సవాన్ని నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండలంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. ముందుగా చిలపనూరుతో తయారుచేసిన దండను మహాత్మాగాంధీ విగ్రహానికి వేసి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారంతా చేనేత వస్త్రాలు ధరించాలని కోరతామన్నారు.

అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్‌ మాట్లాడుతూ చేనేత వస్త్ర వినియోగాన్ని పెంచేందుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది చేనేత వస్త్రాలు ధరించాలని చేనేత దినోత్సవం రోజున ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ప్రస్తుతం అసోసియేషన్‌లో 750 మంది సభ్యులు ఉన్నారని, ఈ సంఖ్యను పెంచేందుకు ఒక్కో సభ్యుడు మరో ముగ్గురిని సభ్యులుగా చేర్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పక్రియ రాబోయే మూడు మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

ఏపీవెపా కృష్ణ గౌరవాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చిలువేరు మార్కండేయ (విజయవాడ) మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మాదిరిగా త్వరలో కృష్ణా జిల్లాలో కూడా చేనేత సమాజంలోని పద్మశాలీ, కుర్ణిశాలీ, తొగటవీర క్షత్రియ, దేవాంగ, కైకాల, కర్ణభక్తులు, తదితర వర్గాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వారందరితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తామన్నారు.

చేనేత కవి, గుంటూరు జిల్లా బాధ్యులు రాపోలు జగన్‌ మాట్లాడుతూ చేనేత సమాజంలోని ప్రతి ఒక్కరూ నిరంతరం చేనేత వస్త్రాలు మాత్రమే ధరించాలని కోరారు. చేనేతలు తయారు చేసిన ఇంట్లో డోర్‌ కర్టన్స్, బెడ్‌షీట్లు, టవళ్లు, పంచలను వాడి మిల్లు వస్త్రాల వినియోగం చాలా వరకు తగ్గించాలన్నారు. చేనేత సంస్కతిని కాపాడుకోవాల్సిన బాధ్యత చేనేత సమాజంలోని అన్ని వర్గాలపై ఉందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్లో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోదాటి బాలకోటేశ్వరరావు, కోశాధికారి పడతల ప్రభాకర రావు, కార్యాలయ ఇన్‌చార్జి మాల కొండయ్య, తాటిపర్తి వెంకటేశ్వర్లు, ఎన్‌ శ్రావణ్‌కుమార్‌, కోటేశ్వరరావు, ఎస్‌ మాధవీ లక్ష్మి, ఎస్‌. సురేష్‌, తుమ్మచెర్ల వెంకటేశ్వర్లు, పొలిశెట్టి శ్రీహరి బాబు, మోహన్‌రావు, బట్టు వెంకట్రావు, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. Walnoniavovan

చేనేత సమాజంలోని వివిధ వర్గాల కార్యవర్గ, సర్వసభ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, సేవా కార్యక్రమాలు, చేనేతల అభ్యున్నతికి ఉపయోగపడే విషయాలను వాట్సప్‌ నెంబర్‌ 83338 71117 పంపాలని మనవి. వాటిని వెబ్‌సైట్‌ www.chenetamitra.comలో పొందుపరుస్తాం.

Follow us on social media

Related posts

Leave a Comment