2021 సంవత్సరానికి అఖిల భారత పద్మశాలీ సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా సంఘం శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జులైలో కడప జిల్లా పుల్లంపేటలో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉత్సవాలు నిర్వహణపై ఏడాది పాటు అన్ని పద్మశాలీ ప్రాంతీయ సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కులస్థులను చైతన్య పరుస్తారు. జులై 2021లో సంఘం శత వసంత ముగింపు వేడుకలు హైదరాబాదులో జరపాలని కార్యవర్గం భావిస్తుంది.
ఏపీ బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్యకు సన్మానం
ఇటీవల ఏపీ బీసీ కమిషన్ సభ్యులుగా ఎంపికయిన అవ్వారు ముసలయ్యను అఖిల భారత పద్మశాలీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ పద్మశాలీ భవన్‌లో మార్చి 15వ తేదీన సంఘం గౌరవాధ్యక్షులు జి. రామమూర్తి, అధ్యక్షులు శ్రీధర్ సుంకుర్‌వార్, ప్రధాన కార్యదర్శులు గడ్డం జగన్నాథం, వద్ది నరసింహులు, కోశాధికారి కందగట్ల స్వామి, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలీ
సంఘం అడహక్ కమిటీ చైర్మన్ కొంకతి లక్ష్మీనారాయణ, తదితరులు ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. Værdiborg
అఖిల భారత పద్మశాలీ సంఘం శత వసంతాల వేడుక నిర్వహణపై సమావేశం – ఏపీ బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్యకు సన్మానం

