మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అయ్యప్ప గుట్టపై నిర్మిస్తోన్న శివమార్కండేయ స్వామి ఆలయంలో త్వరలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నవంబర్ 8,9,10 తేదీల్లో శివమార్కండేయ విగ్రహం, శివలింగము, నంది విగ్రహం, ఇద్దరు ద్వారపాలకులు, కాలభైరవ విగ్రహం, విఘ్నేశ్వర విగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం, నాగ దేవత, నవగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షులు, విశ్రాంత తహసీల్దార్ మచ్చ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఈ వేడుకలకు పద్మశాలీయులు, ప్రజలు భారీగా తరలిరావాలని కమిటీ ఉపాధ్యక్షులు డాక్టర్ పానుగంటి బాలరాజు, కోశాధికారి బాస రామస్వామి, కార్యదర్శి అప్పం అనంతరాములు, సభ్యులు బిజ్జ శంకర్, సూర ప్రతాప్, జన్ను రామచంద్రయ్య, కొంగరి సత్యనారాయణ, పల్లాటి తారకం, దాసు వెంకటేష్, పల్లాటి బుచ్చయ్య, పల్లాటి నాగస్వామి విజ్ఞప్తి చేశారు. BTC Genix V7.2


