బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమంలో దీపావళి వేడుకలు

బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హ్యాపీ హోం వృద్ధుల ఆశ్రమంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక సూచన మేరకు వృద్ధులకు ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ మిఠాయిలు, టపాసులు పంచిపెట్టారు. బాణసంచా కాలస్తుండడంతో తనకు చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని, పిల్లలతో గడిపిన క్షణాలు జ్ఞప్తికి వస్తున్నాయని ఓ వృద్ధురాలు పేర్కొంది. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సమన్వయ కర్తలు చరిత, హేమలత, వలంటీర్లు ప్రవీణ్‌, లీలావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు బుట్టా రేణుకకు ధన్యవాదాలు తెలిపారు. BTC Genix V7.2

Follow us on social media

Related posts

Leave a Comment